దేశంలో తీవ్రస్థాయికి చేరుకున్న కరోనా, 24 గంటల్లో 92071 కేసులు

Advertisement

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే రెండు స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,78,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,071 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. వీరిలో 9,86,598 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 37,80,107 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

ఇక కొత్తగా 1,136 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 79,722కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 28,902,170 కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,22,735 మంది మృత్యువాతపడ్డారు. ఈ కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అన్ని దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here