భారత్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి : సీరమ్ ఇన్‌స్టిట్యూట్

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇది ఇలా ఉంటె కొన్ని వ్యాక్సిన్ లు చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇక మన భారత్ లో కూడా కొన్ని వ్యాక్సిన్ లు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదే తరుణంలో ఆస్ట్రాజెనికా రూపొందిన కరోనా వ్యాక్సిన్ కు సంబంధంచిన క్లీనికల్ ట్రయల్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈ పరీక్షల్లో పనిచేస్తున్న ఓ వలంటీర్‌ అస్వస్థకు గురికావడంతో, ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు ఆస్ట్రా జెనెకా నిర్ణయం తీసుకుంది. దీనితో క్లీనికల్ ట్రయల్స్‌కు విరామం ప్రకటించారు.

ఇక భారత్ ‌లో ఈ టీకా పై జరుగుతున్న క్లీనికల్ ట్రయల్స్‌కు నేతృత్వం వహిస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని స్పష్టం చేసింది. ఆ సంస్థ మాట్లాడుతూ.. బ్రిటన్ లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి మేము మాట్లాడలేము. కానీ భారత్ లో జరగవలసిన ట్రయల్స్ మాత్రం జరుగుతాయని, మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.