వరుసగా ఐదో రోజు 70వేలు దాటినా కరోనా కేసులు

Advertisement

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు 70 వేలకు పైగా నూతన కరోనా కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,512 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. 75వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడటం ఇది వరుసగా ఐదోరోజు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 36లక్షల 21వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 27లక్షల 74వేల మంది కోలుకోగా మరో 7లక్షల 81వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న మరో 60వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది.

ఇక దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు వెయ్యి కరోనా మరణాలు నమోదు అవుతుండటం కలవరపెడుతోంది. నిన్న మరో 971 కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 64,469కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో కరోనా మరణాల్లో మూడో స్థానంలో ఉన్న మెక్సికోను భారత్‌ దాటేసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.8శాతంగా కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here