భారత్‌ లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇక భారత్ ‌లోను కరోనా వైరస్‌ రోజురోజుకు దారుణంగా పెరుగుతోంది. ఒక వైపు రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇక గత 24గంటల్లోనే అత్యధికంగా 11.70లక్షల శాంపిల్స్‌ తో టెస్టులు చేయగా దాంట్లో 83,883 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్ ‌లో ఒకటే రోజు 80వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.

అంతేకాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఏ దేశంలోనూ ఒక్కరోజులో అధికంగా ఇన్నికేసులు నమోదు అవ్వలేదు. ఇక గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరుకుంది. అలాగే దింట్లో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకున్నారు. మరో 8 లక్షలకు పైగా కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here