దేశంలో అరకోటికి చేరిన కరోనా కేసులు

Advertisement

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తుంది. ఇక భారత్ లో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఇక దేశంలో కరోనా కేసులు ఐదు మిలియన్లకు పైగా నమోదు అయ్యాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, తరువాత రెండవ స్థానంలో భారత్ ఉంది. అయితే గత పదకొండు రోజుల్లో 10 లక్షల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక నిన్నటితో దేశంలో 50 లక్షల కరోనా వైరస్ కేసుల మార్క్ ను దాటింది. ఇక నిన్న దేశ వ్యాప్తంగా 90వేల కేసులు నమోదు అవ్వగా, దాంట్లో 1275మంది మరణించారు. ఇక దీనితో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 50 లక్షల 14 వేల 395కి చేరుకుంది. ఇక ఈ విధంగా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here