భారత్ లో బీభత్సం సృష్టిస్తున్న కరోనా

Advertisement

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు దారుణంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా టెస్టులు పెంచడంతో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటె గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 75,809 కేసులు నమోదయ్యాయి. అలాగే 1,133 మంది ఈ మహమ్మారి కాటుకు మృతి చెందారు.

ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 42,80,422కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు మొత్తం 72,775 మంది మరణించారు. అలాగే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,98,621 కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో ఇప్పటి వరకు మొత్తం 5,06,50,128 నమూనాలను పరీక్షించినట్లు ICMR తమ నివేదికలో వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here