కరోనా కేసుల్లో ప్రపంచంలోనే 2వ స్థానానికి చేరుకున్న భారత్

Advertisement

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఇక భారత్‌లోను కరోనా మహమ్మారి అతివేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రతిరోజు 90వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇక దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 90,802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే 90వేల కేసులు నమోదవ్వడం వరుసగా ఇది రెండోసారి అని చెప్పాలి.

అయితే మొదటగా నమోదయ్యిన కేసులకంటే 170 కేసులు అదనంగా నమోదయ్యాయి. ఇక దీంతో సోమవారం ఉదయానికి భారత్ ‌లో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 4వేల (42,04,613)కు చేరుకుంది. ఇక ఇప్పుడు నమోదయ్యిన కేసుల సంఖ్యతో భారత్‌ కరోనా కేసుల్లో బ్రెజిల్‌ ను వెనుకకు తప్పించి ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరింది. ఇక మొదటి స్థానంలో అమెరికా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here