భారత్ లో కొత్తగా 86,432 కేసులు.. 1,089 మరణాలు

Advertisement

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇక భారత్ లోను కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న భారత్, రెండవ స్థానానికి దగ్గరలో ఉంది. అయితే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346 పరీక్షలు నిర్వహించారు. ఇక దాంట్లో కొత్తగా 86,432 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ అత్యధికంగా ఒక్క రోజులో నమోదైన కేసులు ఇవే.

దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. ఇక దింట్లో 8,46,395 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అలాగే 31,07,223 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అలాగే కొత్తగా 1,089 మంది ఈ మహమ్మారి దాటికి బలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here