24 గంటల్లో కరోనా వల్ల 1096 మంది మృతి

Advertisement

దేశంలో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంది.దేశంలో రోజుకు కొన్ని వేలమంది కరోనా భారిన పడుతున్నారు. అలాగే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1096 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఆగస్టు 19వ తేదీన నమోదైన 1092 మరణాలే ఇప్పటివరకు అత్యధికం. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68,472కు చేరుకుంది.

ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 39లక్షల 36వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 30లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 66వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here