దేశంలో ఒక్క ఆగస్ట్ నెలలోనే 20లక్షల కరోనా కేసులు

Advertisement

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. రోజుకు కనీసం 70వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కేవలం ఒక్క ఆగస్ట్ నెలలోనే దాదాపు 20 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఆగస్ట్ నెలలో ఇన్ని కేసులు నమోదు కాలేదు. అత్యధిక వైరస్‌ తీవ్రత ఉన్న అమెరికాలోనూ జులై నెలలో అత్యధికంగా 19లక్షల 4వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. భారత్‌లో ఆగస్టు నెలలోనే రికార్డుస్థాయిలో 19లక్షల 50వేల కేసులు బయటపడ్డాయి. మరణాలు మాత్రం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ఆగస్టు నెలలో అమెరికాలో 31వేల కొవిడ్‌ మరణాలు నమోదుకాగా బ్రెజిల్‌లో దాదాపు 30వేల మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఈ సంఖ్య దాదాపు 28వేలుగా ఉంది. గడిచిన 24గంటల్లో మరో 69,921 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గత నాలుగురోజులతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో మంగళవారంనాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 36లక్షల 91వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 28లక్షల 39వేల మంది కోలుకోగా మరో 7లక్షల 85వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here