భారత్ చైనాను తక్కువ అంచనా వేస్తుంది

Advertisement

గ్లోబల్ టైమ్స్ అనేది చైనా ప్రభుత్వం యొక్కఅధికార మీడియా ప్రతినిధి. గ్లోబల్ టీమ్స్ ఏదైనా ప్రచురించిందంటే అది దాదాపు చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినట్టే. గత మూడు నెలలుగా జరుగుతున్న ఇండియా చైనా గోడవల పై గ్లోబల్ టైమ్స్ సంపాదకుడు భారత్ పై ఉన్న తన అక్కసును వెళ్లబుచ్చాడు. చైనాను భారత్‌ తక్కువగా అంచనా వేస్తోందంటూ వ్యాఖ్యానించారు. డ్రాగన్‌ యుద్ధం గెలవలేదని భారత్‌ తక్కువగా అంచనా వేస్తోందని విశ్లేషించారు.

1962కు ముందు తరహాలోనే చైనాను భారత్‌ చాలా తక్కువ అంచనా వేస్తోందని, చైనా యుద్ధం చేయలేదని భారత్ అనుకుంటుందని, కానీ చైనా సైన్యం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమయిందని వెల్లడించారు. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు సైనిక ఘర్షణకు దిగితే.. భారత్‌ 1962 కంటే దారుణమైన ఓటమిని చవిచూస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఇండియన్ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here