చైనా ఎత్తులకు భారత్‌ పై ఎత్తు

Advertisement

భారత్, చైనాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే గాల్వన్ లో జరిగిన ఇరు దేశాల సంఘటనలో పలువురు జవాన్లు మరణించారు. ఇక అప్పటి నుండి భారత్, చైనాల మధ్య ఎప్పుడు ఒక వివాదం నెలకొంటుంది. తాజాగా తూర్పు లద్దాఖ్ ‌లో భారత్‌, చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద సెగలు రగులుతూనే ఉన్నాయి.

అయితే గత నెల 29వ తేదీన అర్ధరాత్రి ఈ సరస్సు దక్షిణ తీరాన్ని దక్కించుకోవడానికి డ్రాగన్‌ ప్రయత్నం విఫలయత్నం చేసిన నేపథ్యంలో, ఇక ఈ ప్రాంతంలో మన భారత దళాలు తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది. లద్దాఖ్‌ లోని 1597 కిలోమీటర్ల మేర పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ‘సరిహద్దు నిర్వహణ’ మాత్రమే చేపట్టే భారత్‌.. ఇప్పుడు ‘సరిహద్దు రక్షణ’కు చర్యలు చేపట్టింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here