ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై దుష్ప్రచారం చేసిన పాకిస్తానీయులు

Advertisement

ఢిల్లీ: ఇండియా చైనా మధ్య ఉన్న జరుగుతున్న వివాదంపై వస్తున్న తప్పుడు సమాచారం వెనక కొంతమంది ఆకతాయి పాకిస్థానీయులు ఉన్నారని ట్విట్టర్ నిర్వాహకులు తెలిపారు. ఈ వివాదం మొదలైన తరువాత ట్విట్టర్ కొన్ని వందల పాకిస్థాన్ కు చెందిన ట్విట్టర్ హ్యాండిల్స్ చైనీస్ భాష అయిన మాండరిన్ లోకి మార్చారని ట్విట్టర్ అధికారులు తెలిపారు.

మే నెల ప్రారంభంలో ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం మొదలు కాగా జూన్ 15న గాల్వన్ వ్యాలీ దగ్గర వివాదం మరింత చెలరేగింది. అయితే దీన్ని అదునుగా తీసుకొని ఆకతాయి పాకిస్థానీయలు తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్ చైనాలో బ్యాన్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయినా వర్చ్యువల్ ప్రైవేట్ నెట్వర్క్ ల ద్వార ట్విట్టర్ ను వాడవచ్చు. ఇలా తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్న వారి అకౌంట్స్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ట్విట్టర్ లొనే కాకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో తప్పుడు సమాచారం పోస్ట్ అయ్యాయని టెక్ పండితులు చెప్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here