కేవలం రెండు గంటల్లో చైనాకు చుక్కలు చూపించిన భారత్

Advertisement

గత మూడు నెలల నుండి సరిహద్దులో ఇండియా-చైనా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చైనా అధికారులు చేసుకున్న ఒప్పందాలను అనేకసార్లు తుంగలో తొక్కారు కానీ ఇండియా సహనం పాటిస్తూనే ఉంది. చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకుందాం అంటూ చైనాకు ఇండియా సంకేతాలు కూడా పంపింది. అయితే చైనా తన దుర్బుద్ధిని చూపించింది.

ఇండియా ఆధీనంలో ఉన్న బ్లాక్‌ టాప్‌, హెల్మెట్‌ టాప్‌ శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన సైన్యంతో శిబిరం నుంచి బయల్దేరిన చైనా దళాలకు గట్టి షాక్‌ తగిలింది. మిలమిలలాడే రాకెట్‌ లాంఛర్లతో భారత దళాలు కనిపించాయి. ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా భారత్‌ బెదరకపోవడంతో హెచ్చరికగా కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. గల్వాన్‌ వద్ద భారత్‌ చేసిన ప్రతిదాడి గుర్తొచ్చిందో ఏమో చైనా దళాలు కాళ్లీడ్చుకొంటూ తిరిగి తమ స్థావరానికి చేరుకొన్నాయి.. ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని కేవలం 120 నిమిషాల్లో ముగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here