భారత్, చైనా సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్

Advertisement

భారత్ చైనా సరిహద్దుల్లో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే భారత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇండో, చైనా సరిహద్దుల‌తో పాటు, ఇండియా, నేపాల్‌, ఇండో, భూటాన్ సరిహద్దుల్లో భారత బలగాలు అందరు కూడా అలర్ట్‌గా ఉండాలని హోంశాఖ సూచించింది. అలాగే చైనా సరిహద్దు ఉన్న ప్రాంతాలు అన్ని కూడా మరింత భద్రతా పెంచాలని ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్‌, సహస్త్రా సీమా బల్‌ కు ఆదేశాలు ఇచ్చింది.

ఇక సరిహద్దులో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించారు. అయితే పాన్‌గాంగ్ సో సరస్సు, రీక్విన్ లా, రీజాంగ్ లా, స్పాన్‌గుర్ గాప్ ప్రాంతాల్లో భూ ఆక్రమణకు పాల్పడాలని ప్రయత్నించిన చైనా దళాలను భారతీయ ఆర్మీ వివాదం కి దిగింది. ఇక అప్పటి నుండి భారత్, చైనా సరిహద్దులలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here