భారత్ లో మొబైల్ తయారీపై ఆసక్తి కనపరుస్తున్న విదేశీ సంస్థలు

Advertisement

మొబైల్ తయారీ కోసం భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రూ. 41000 కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకానికి తైవానీస్ దిగ్గజాలు ఫాక్స్కాన్, ఆపిల్, శ్యాంసంగ్, షియోమి వంటి సంస్థలకు మొబైల్ తయారు చేస్తున్న వేస్ట్రన్ మరియు పెగాట్రాన్ వంటి సంస్థలు దరఖాస్తులను సమర్పించాయి.
అలాగే భారతీయ సంస్థలు అయిన లావ, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి సంస్థలు కూడా ఈ పథకంపై ఆసక్తిని కనపరుస్తున్నాయి. అయితే చైనా సంస్థలైన వివో, ఒప్పో వంటి సంస్థలు మాత్రం చైనా- భారత్ మధ్య జరుగుతున్న సరిహద్దు గొడవల కారణంగా ఈ పతాకంపై ఆసక్తిని కనపరచడం లేదు.

వోకల్ ఫర్ లోకల్ అంటున్న ప్రధాని మోదీ ఇప్పటివరకు ఇండియాలో ఒక్క మొబైల్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో వాటికి చెక్ పెట్టింది. రానున్న రోజుల్లో ప్రధాని ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి మన దేశంలో మ్యాను ఫ్యాక్చరింగ్ విభాగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని బీజీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here