India Bank : బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్
NQ Staff - March 2, 2023 / 06:30 PM IST

India Bank : దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు ఇండియా బ్యాంక్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. గత కొన్నాళ్లుగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ వారానికి రెండు రోజుల సెలవులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ ని పరిశీలిస్తున్నట్లుగా ఇండియా బ్యాంక్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది ఇప్పటికే నెలలో రెండు శని వారాలు సెలవు దినాలుగా బ్యాంకు ఉద్యోగులకు కొనసాగుతూ వస్తున్నాయి. తాజా నిర్ణయంతో వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు బ్యాంక్ ఎంప్లాయిస్ కి సెలవులుగా దక్కబోతున్నాయి.
డిజిటల్ చెల్లింపులు మరియు ఇతర కారణాల వల్ల బ్యాంక్ లపై ఒత్తిడి తగ్గింది. అందుకే వారంలో రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించి అయిదు రోజులు పని దినాలుగా ప్రకటించాలని ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదే జరిగితే బ్యాంక్ ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్.. అదే విధంగా బ్యాంకు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అవుతుందని అంటున్నారు.