త్వరలో కరోనా కేసుల్లో రెండవ స్థానం చేరుకోనున్న భారత్

Advertisement

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త రికార్డ్ ను సృష్టిస్తుంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 90,632 మందిలో వైరస్‌ బయటపడింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41లక్షలకు చేరింది.

ఈ సంఖ్యతో కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌కు భారత్‌ చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 73వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here