LPG: చుక్క‌ల‌నంటుతున్న నిత్యావ‌స‌రాలు.. సిలిండ‌ర్ ధ‌ర రెండు వేల‌కు పైనే..!

LPG: శ్రీలంక‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి. నిత్యావ‌స‌ర ఆహార ప‌దార్ధాల‌పై ధ‌ర‌ల నియంత్ర‌ణను ప్ర‌భుత్వం ఎత్తి వేసింది.దీంతో అక్క‌డ విచిత్ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. థ‌ర‌ల‌పై నియంత్ర‌ణ తీసుకు రావ‌డంతో అక్ర‌మ నిల్వ‌లు పెరిగాయి. మార్కెట్ స‌రఫ‌రా కూడా త‌గ్గింది. నిత్యావ‌స‌రాల‌పై ధ‌ర‌ల నియంత్ర‌ణ తొలిగిస్తున్న‌ట్టు శుక్ర‌వారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Increase in LPG Cylinder Prices
Increase in LPG Cylinder Prices

దీంతో 1400 రూపాయ‌లు ఉన్న 12.5 కేజీల వంట గ్యాస్ సిలిండ‌ర్ 2657కి చేరింది. ఇక కేజీ పాల పొడి ధ‌ర 250 రూపాయ‌ల నుండి 1195కి చేరింది. ఇవే కాకుండా గోధ‌మ పిండి, పంచ‌దార‌, ప‌ప్పులు, సిమెంట్ అన్ని కూడా ఆకాశాన్ని అంటాయి. ధ‌ర‌లు త‌గ్గించాల‌ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

గ‌త ఏడాది కాలంగా శ్రీలంను ఆహార‌, ఆర్ధిక సంక్షోభం కుదిపేస్తుంది. అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల‌న మార‌క ద్ర‌వ్యం భారీగా ప‌తనం అయింది. కరోనా వ‌ల‌న ఎగుమ‌తులు కూడా దెబ్బ‌తిన్నాయి. ప‌ర్యాట‌క రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. దీంతో విదేశీ మార‌క నిల్వ‌ల‌ను ఆదా చేసుకునే క్ర‌మంలో దిగుమ‌తుల‌ని నిషేదించింది. ప‌ప్పులు, పంచదార‌, గోధుమపిండి, కూరగాయ‌లు వంటి వ‌స్తువుల‌కు కూడా శ్రీలంక దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది.