Secunderabad : సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మొదటి అంతస్థులో అస్థిపంజరం
NQ Staff - January 21, 2023 / 06:10 PM IST

Secunderabad : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు అనేది ప్రచారం. ఈ క్రమంలో మొదటి అంతస్తు వెనుక భాగంలో అస్తిపంజరం బయటపడడం సంచలనంగా మారింది.
గుజరాత్ కు చెందిన ముగ్గురు భవనంలో చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది. లభించిన అస్తిపంజరం ఆ ముగ్గురిలో వరిది అనే విషయం తెలియాల్సి ఉంది. అస్తిపంజరం పూర్తిగా కాలి పోవడంతో గుర్తించడం చాలా కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో సారి డెక్కన్ మాల్ పరిసర ప్రాంతాలు పర్యటించారు. అగ్నిప్రమాదం తాలూకు భయాందోళన ప్రాలదోలేందుకు ప్రయత్నించారు. భవనం ఒక్కసారిగా కూలి పోతే తీవ్రంగా నష్టపోతామని చుట్టుపక్కల వాళ్ళు మంత్రికి తెలియజేశారు.

Incident Of Fire Deccan Mall Secunderabad Causing Stir
స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా భవనాన్ని తిరిగి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదం సమయంలో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. దాంతో స్థానికులు ప్రాణ భయంతో కిలోమీటర్ల దూరం పరుగులు తీశారు. భారీ ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నా కూడా మంటలు ఆర్పడానికి చాలా సమయం పట్టింది.