అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్న భారతీయ సంతతికి చెందిన మహిళ

Advertisement

అమెరికా ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ లో జరగున్న ఎన్నికల కోసం అక్కడి నాయకులు కరోనా కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఒక నాయకురాలు పోటీ చేయనున్నారు. డెమోక్రట్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్, ‌ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు.

కమలా హారీస్ యొక్క తల్లి భారతదేశానికి, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశానికి చెందిన వారు.కమలా హారిస్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్‌ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. జో బిడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. తామిద్దరం కలిసి డోనాల్డ్ ట్రంప్ ను ఓడిస్తామని జో బిడెన్ వ్యాఖ్యానించారు. తామిద్దరం కల్సి అమెరికాను తిరిగి గాడిలో పెడతామని హారీస్ తెలిపారు. జో బిడెన్ కు మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here