Onion : విడ్డూరం : కేజీ చికెన్ రూ.300.. కేజీ ఉల్లిగడ్డ రూ.900
NQ Staff - January 23, 2023 / 10:44 PM IST

Onion : ప్రస్తుతం పాకిస్థాన్ లో అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆర్థిక మాంద్యం దెబ్బతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంటే పిలిపెన్స్ లో గడ్డు కాలం నడుస్తోంది.
ఈ సమయంలో ఫిలిపెన్స్ దేశంలో ఉల్లిగడ్డ ధర ఏకంగా 900 రూపాయలకు చేరి ఆ దేశ ప్రజలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి గడ్డతో పోలిస్తే చికెన్ రేటు చాలా తక్కువ ఉంది. చికెన్ కేవలం 300 రూపాయలు మాత్రమే ఉంది.
మనదేశంలో ఉల్లి ధర 20 నుండి 30 రూపాయల మధ్యలో ఉంది, కానీ ఆ దేశంలో మాత్రం ఏకంగా 900 రూపాయల రేటు పలుకుతుంది. మన దేశంలో చికెన్ రేట్ 300 రూపాయలు ఉండగా ఆ దేశంలో అదే రేటు కంటిన్యూ అవుతుంది.
ఉల్లిలోనే ఎందుకు ఇంత వ్యత్యాసం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనవరి నెల ఆరంభంలో 31 వేల డాలర్ల విలువైన ఉల్లి సరుకును సీజ్ చేశారు. దుస్తుల పేరుతో చైనా నుండి ఉల్లిపాయలను తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది.
ఉల్లిగడ్డల డిమాండ్ ఆ దేశంలో విపరీతంగా ఉంది, డిమాండ్ కి తగ్గట్లుగా సరఫరా లేక పోవడంతో ఇలా భారీ ఎత్తున రేట్లు పెరిగాయని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భారీ ఎత్తున విదేశాల నుండి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.