శ్రీశైలం ఘటనలో బయటపడ్డ ఆరుగురి మృతదేహాలు

Advertisement

శ్రీశైలంలో జల విద్యుత్ కేంద్రం దగ్గర జరిగిన ప్రమాదంలో ఆరుగురి మృతు దేహలు లభ్యం అయ్యాయి. అయితే విద్యుత్ కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా ఆరు మృతు దేహాలను బయటకు తీసుకొచ్చారు. దాంట్లో ఒక మృతుడిని ఏఈ సుందర్ నాయక్‌ గా అధికారులు గుర్తించారు. మృతుడిది‌ సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం జగన్ తండా వాసిగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.

అయితే అగ్నిప్రమాదం తర్వాత డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, వెంకట్రావు, ఫాతిమా, మోహన్ కుమార్, ఫ్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్‌తో పాటు ఆమ్రాన్ కంపెనీకి చెందిన వినేష్, మహేష్ లోపలే చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఇక మిగితా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here