అసలు ఎవరు ఈ బినోద్ ? ఎందుకు ఈ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి?

Advertisement

ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు బినోద్. ఈ పేరు ఇప్పుడు దేశంలో ట్రెండ్ అవుతుంది. మొదట నార్త్ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ పేజెస్ ఈ పేరుతో కంటెంట్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు ఈ పేరు సౌత్ పేజెస్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ బినోద్ అనే పేరు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతుందో చాలా మందికి తెలియదు. అసలు బినోద్ అనే పేరు ఎందుకు ట్రెండ్ అవుతుందంటే “slay point” అనే యూట్యూబ్ ఛానల్ లో ఇండియాలో యూట్యూబ్ వీడియోస్ కు వచ్చే ఫన్నీ కామెంట్స్ ను రోస్ట్ చేస్తూ ఒక వీడియో చేశారు.

అయితే బినోద్ తారు అనే ఒక వ్యక్తి తాను చూసిన ప్రతి వీడియో కింద కంటెంట్ తో సంబంధం లేకుండా బినోద్ అని కామెంట్ చేస్తూ ఉండటాన్ని యు ట్యూబర్ గుర్తించాడు. దీంతో ఈ పేరు నార్త్ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ పేజెస్ లో, ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇంటర్ నెట్ లో ఏది, ఎందుకు, ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. నార్త్ పేజెస్ కు కంటెంట్ లేకపోవడం వల్లే ఇలాంటి వాటిని కూడా వైరల్ చేస్తున్నానని సౌత్ పేజెస్ అడ్మిన్స్ చెప్తున్నారు. ఈ పేరుతో తెలుగులో చాలా మీమ్స్ వస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here