తూర్పు గోదావరి పోలీస్ స్టేషన్ లో 31 మందికి కరోనా

Advertisement

ఏపీ లో కరోనా శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ప్రతిరోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు చాలా మంది కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే దింట్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే కరోనా ఒకవైపు పోలీసులను కూడా వదలడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. తుని పోలీస్ స్టేషన్ లో 36 మంది ఉంటారు.

దాంట్లో 31 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు ఈ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు ఎవరు కూడా విధులకు ఎవరిని రావొద్దు అని ఆదేశాలు జారీ చేసారు. పోలీసుల కుటుంబ సభ్యులను కూడా కరోనా పరిక్షలు చేయించుకోవాలని చెప్పి ప్రత్యేక బృందంతో వారికి కరోనా పరిక్షలు చేపిస్తున్నారు. దాంట్లో కొంతమంది కరోన పరిక్షల ఫలితాలు రావాల్సి ఉంది. పోలీసులకు కరోనా రావడం తో సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here