Ileana D’Cruz Shared Picture Of Her Lover On Social Media : ఎట్టకేలకు తన ప్రెగ్నెన్సీకి కారణం అయిన వ్యక్తిని పరిచయం చేసిన ఇలియానా..!
NQ Staff - July 17, 2023 / 12:49 PM IST

Ileana D’Cruz Shared Picture Of Her Lover On Social Media :
ఇలియానా గురించి కొంత కాలంగా ఓ ప్రశ్న అందరినీ కదలించేస్తోంది. ఆమె ఇన్ని రోజులు ఈ విషయాన్ని సస్పెన్స్ లో పెట్టేసింది. కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. సౌత్ నుంచి నార్త్ వరకు తన అందంతో, సన్న నడుముతో కుర్రాళ్లను ఊపేసింది ఈ గోవా బ్యూటీ. ఇప్పుడు ఎక్కవుగా ముంబైలోనే ఉంటుంది.
బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. కాగా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో చాలామందితో డేటింగ్ చేసింది. కానీ అందరినీ వదిలేసింది. రీసెంట్ గా తాను ప్రెగ్నెంట్ అంటూ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో మాత్రం చెప్పలేదు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంపై అంతా షాక్ అయిపోయారు.
డిన్నర్ డేట్ కు వెళ్లి..

Ileana D’Cruz Shared Picture Of Her Lover On Social Media
ఇన్ని రోజులు అతని గురించి చెప్పలేదు. కానీ తాజాగా అతను ఎవరో బయట పెట్టేసింది. అతనితో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫొటోలను ఆమె ఇన్ స్టాలో పంచుకుంది. దీంతో ఇలియానా మిస్టరీ మ్యాన్ వెలుగులోకి వచ్చాడు. అతను పూర్తి గడ్డంతోనే ఉన్నాడు. చూస్తుంటే అతను విదేశీయుడు అని తెలుస్తోంది.
కానీ అతని వివరాలు మాత్రం బయట పెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. మరి అతను ఎక్కడ పరిచయం అయ్యాడో, ఏం చేస్తుంటాడో, అసలు ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది ఇలియానా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. అతను ఎవరనేది ముందు ముందు అయినా చెప్తుందేమో చూడాలి.