Ileana D’Cruz Lover Details : షాకింగ్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఇలియానా.. అతని పూర్తి వివరాలు ఇవే..!
NQ Staff - August 8, 2023 / 09:34 AM IST

Ileana D’Cruz Lover Details :
ఇలియానా ఈ నడుమ షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆమె కెరీర్ పరంగా బాగానే ఎదిగింది. ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అలాంటిది వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ వివాదాల్లోనే నిలుస్తోంది. ఇప్పటికే ఆమె చాలామందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.
అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ షాక్ ఇచ్చింది ఇలియానా . కానీ దానికి కారణం ఎవరో మాత్రం చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత గత నెల జులైలో అతని ఫొటోలను రివీల్ చేసింది. కానీ అతని వివరాలు మాత్రం గోప్యంగా ఉంచేసింది. అయితే ఆమె ప్రియుడు విదేశీయుడు అని మాత్రం ఇట్టే తెలిసిపోతోంది.
అతని పేరేంటంటే..
అయితే ఆగస్టు 1న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు పేరును కోయా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. దాంతో ఆమెకు అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇలియానా ప్రేమించిన వ్యక్తి పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. అతని పేరు మైఖేల్ డోలన్.

Ileana D’Cruz Lover Details
వీరిద్దరూ మే 13న నిరాడంబరంగా చర్చిలో పెళ్లి చేసుకున్నారంట. అంతకు ముందే ఏప్రిల్ 18న ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే ఆమె పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. కాగా మైఖేల్ గురించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. త్వరలోనే ఆమె తన భర్త గురించి పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది.