Vaccine: వ్యాక్సిన్ రెండో డోసు లేట్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Vaccine: కరోనా ప్ర‌ళయం సృష్టిస్తున్న ఈ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ విధిగా తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా, స్టాక్ లేని ప‌క్షంలో కొంద‌రు స‌రైన టైంకు వ్యాక్సిన్ వేసుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలను మాత్రమే వస్తున్నారు. త్వరలో స్పూత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది.

దేశంలో అత్యధికంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు. కోవ్యాక్సిన్‌కు విపరీతమైన కొరత ఉంది. కోవాగ్జిన్ తొలిడోసు వేసుకున్న వారు నెల రోజుల‌కు రెండో డోసు వేసుకోవ‌ల‌సి ఉంటుంది. కాని కొర‌త ఉండ‌డంతో ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన ప‌రిస్థితి. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యమైతే ఏమైన ఇబ్బందులు త‌లెత్తుతాయా అనేది ప్ర‌తి ఒక్కరి ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతం మ‌నకుఅందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ రెండు డోసులు వేసుకోవ‌ల‌సిందే. మొదటి డోసు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తే.. రెండో డోసు దాన్ని బలపరిచే మెమరీ-బి కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ కణాలు రోగనిరోధక శక్తి అప్రమత్తంగా ఉండేలా ప్రేరేపిస్తాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నవారు సుమారు 12 నుంచి 16 వారాల తర్వాతే రెండో డోసు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే, కోవ్యాక్సిన్‌కు మాత్రం.. మొదటి డోసు తీసుకున్న ఆరు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని తెలుపుతున్నారు.

కోవిషీల్డ్ త‌ర‌హ‌లో కోవాగ్జిన్ తొలి డోస్ బ‌ల‌మైన యాంటీ బాడీల‌ను ఇవ్వ‌ద‌ని స‌మాచారం. ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల్లో రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే వైరస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. అయితే కోవాగ్జిన్ రెండో డోస్ మిస్ అయితే వైద్యుల సూచ‌న త‌ప్ప‌క తీసుకోవాలి. మొద‌టి డోస్ ప్ర‌భావం ఎంత వ‌ర‌కు ఉంటుంది, కోవ్యాక్సిన్ మొదటి డోసును తీసుకుని రెండో డోసు మిస్సయినవారు మళ్లీ మొదటి డోసు తీసుకొని వేచిచూడాలా అనే ప్ర‌శ్న‌ల‌కు డాక్టర్స్ ద‌గ్గ‌ర స‌మాధానం తీసుకుంటే బెట‌ర్. ఒక వేళ మీరు మొదటి డోసు తర్వాత కోవిడ్ వైరస్‌కు గురైనట్లయితే 2 నుంచి 3 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలి.