‘VI’ గా రానున్న ఐడియా అండ్ వడాఫోన్

Advertisement

మొబైల్ నెట్ వర్క్ సంస్థలైన ఐడియా-వడాఫోన్ మెర్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు మెర్జ్ అయిన తరువాత తమ లోగోను ఈరోజు విడుదల చేశారు. “VI-FOR TOMORROW” అంటూ తమ లోగోను విడుదల చేశాయి. ఈ రెండు నెట్వర్క్స్ నష్టాల్లో ఉండటం వల్లే మెర్జ్ అయ్యాయి. ఈరెండు నెట్వర్క్స్ మెర్జ్ అయిన తరువాత దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ గా అవతరించాయి.

ఈ రెండు మెర్జ్ అయినా కూడా తమ పోటీదారుల నుండి వస్తున్న పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా జియో వచ్చిన తరువాత ఆ పోటీ మరింత పెరిగింది. జియో దాదాపు అన్ని నెట్వర్క్స్ ను కష్టాల్లో నెట్టేసింది. ఎందుకంటే జియో ఇస్తున్న ఆఫర్స్ దాదాపు అందరిని ఆకట్టుకుంటున్నాయి. VI తోనైనా జియోకు పోటీ ఇస్తారో లేదో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here