ICMR: ఐసీఎమ్ఆర్ కొత్త రూల్.. పరీక్ష చేయించుకోన‌క్క‌ర్లేదు అంటూ సూచ‌న‌

ICMR: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ కొనసాగుతోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల దాకా రోజూవారీ కేసులు 10 వేల లోపే ఉంటే ప్రస్తుతం ల‌క్ష‌న్నర దాటాయి. దేశంలో అన్ని రాష్ట్రాల‌లో క‌రోనా విజృంభ‌ణ సాగుతున్న నేప‌థ్యంలో ప‌లు ప్ర‌భుత్వాలు నైట్ క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ల బాట ప‌డుతున్నాయి.

icmr new rules
icmr new rules

అయితే ఒమిక్రాన్ వైర‌స్ గ‌త వైర‌స్‌ల క‌న్నా అంత ప్ర‌బావితం అయిన‌ది కాద‌ని కొంద‌రు అంటున్నారు. దీని వ‌ల‌న పెద్దగా ఎఫెక్ట్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కూడా చెబుతున్నారు.మ‌రోవైపు ఐసీఎమ్ఆర్ ఈ వైర‌స్‌కి సంబంధించి అనేక సూచ‌న‌లు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది.

కొవిడ్ పేషెంట్లకు దగ్గరగా ఉన్న వారిని హై రిస్క్ ఉంటేనే తప్ప ఎటువంటి లక్షణాలు లేనప్పుడు పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సోమవారం వెల్లడించింది. కరోనావైరస్ శాంపుల్స్ పై రీసెంట్ గా పరీక్షలు జరిపి గైడ్ లైన్స్ విడుదల చేసింది. 60ఏళ్లు లేదంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్రోనిక్ లంగ్, కిడ్నీ వ్యాధులు, ఒబెసిటీ ఉన్న వారు కొవిడ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయి ఉంటే వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.

మరోవైపు లక్షణాలు లేకుండానే ఉన్న గర్భిణీ మహిళలకు పరీక్షలు జరిపి భయాందోళనకు గురి చేయొద్దని సూచించింది. మొత్తానికి పరీక్షలు నిలిపేయకుండా ఎమర్జెన్సీగా జరపడాన్ని వాయిదా వేయాలని తెలిపింది. ఈ కొవిడ్ పరీక్షలు పేరుతో అత్యవసరమైన మిగతా పరీక్షలకు ఆలస్యమవుతుందని తెలిపింది. రాష్ట్ర పరిధిలో ప్రయాణించే వ్యక్తులకు పరీక్షలు జరపాల్సిన అవసరం లేదు.

imr new rules
imr new rules

RT-PCR, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, ర్యాపిడ్ మాలిక్యూలర్ టెస్టింగ్ సిస్టమ్స్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా పరీక్షను చేపట్టవచ్చని పేర్కొంది. ఇంట్లో లేదా ఇతర మాలిక్యూలర్ పరీక్షలను నిర్ధారణగా పరిగణించవచ్చని సలహాదారు తెలిపారు.