ICC T20: 2022 టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

ICC T20: కరోనా వేళ వినోదం అనేది దొర‌క‌డం చాలా క‌ష్టంగా మారింది. ఈ స‌మ‌యంలో క్రికెట్ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌నే చెప్పాలి. బ‌యోబబుల్ న‌డుమ ఉన్న క్రికెట‌ర్స్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ ఏడాది టీ 20 క్రికెట్ మ్యాచ్ ఆడిన భార‌త్ సెమీస్‌కి కూడా చేర‌కుండా క్రికెట్ అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది.

Icc t20 2022 world cup annoument
Icc t20 2022 world cup annoument

తాజాగా ఆస్ట్రేలియా వేదిక‌గా ఈ ఏడాది చివ‌ర్లో జరగనున్న పురుషుల టీ20 వ‌రల్డ్‌క‌ప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల(జనవరి) 21న వరల్డ్‌కప్‌ షెడ్యూల్ాను వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

ఈ నెల 21న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు సంబంధించిన కీల‌క వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆతుర‌త‌గా ఎదురుచూస్తున్నారు. మొత్తం 12 జ‌ట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబ‌ర్ 13-న‌వంబ‌ర్ 16 మ‌ధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌ దుబాయ్‌ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఫించ్‌ నేతృత్వంలో ఆసీస్‌ జట్టు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలిచింది.

ఇదిలా ఉంటే, టీ20 ర్యాంకింగ్స్‌లో గతేడాది చివరి నాటికి టాప్‌-8లో ఉన్న జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్‌-2022కు నేరుగా అర్హ‌త సాధించగా.. మిగ‌తా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. భార‌త్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘ‌నిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్లు క్వాలిఫైయ‌ర్స్‌లో తలపడతాయి.

Icc t20 2022 world cup annoument1
Icc t20 2022 world cup annoument1

మొత్తం ఈ టోర్నీలో 45 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ 45 మ్యాచ్‌లు 7 వేదిక‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్​బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాలు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు వేదికలుగా నిలువ‌నున్నాయి. సిడ్నీ, అడిలైడ్ వేదిక‌ల్లో నవంబర్ 9, 10వ తేదీల్లో సెమీ ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఇక న‌వంబ‌ర్ 13న మెల్‌బోర్న్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది. కాగా ఇది ఎనిమిదో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.