Hyper Aadi జబర్దస్త్ షో అంటే వెకిలి షో.. వెకిలి నవ్వు.. బూతు కామెడీ.. అడల్డ్ కంటెంట్.. శ్రుతి మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని తెలిసిందే కదా. అందులోనూ మరీ ముఖ్యంగా హైపర్ ఆది వేసే పంచ్‌లు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. అదిరే అభి కాస్త హెల్దీ కామెడీనే చేస్తుంటాడు. కానీ మధ్య మధ్యలో కొన్ని జెర్క్‌లు ఇస్తుంటాడు. అసలు అదిరే అభి చేసే స్కిట్లు బాగా లేకపోయినా, నవ్వులు తెప్పించకపోయినా ఇంకా అతన్ని, అతని టీంను భరిస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఇద్దరూ ఇద్దరే అని నిరూపించుకున్నారు. హైపర్ ఆది స్కిట్లలో సుధీర్ అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్‌గా వస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం కూడా ఆది స్కిట్లో సుధీర్ సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే సుధీర్ వస్తూనే.. బుధవారం శేఖర్ మాస్టర్ ప్రదీప్.. శుక్రవారం గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వేసుకుంటారు.. ఇక గురువారం అయినా హాయిగా ఉండొచ్చు అనుకుంటే నువ్ ఇలా తీసుకొచ్చి వేస్తున్నావ్ అంటూ తన ఆవేదనను చెబుతాడు.
హైపర్ ఆది, అభి ఇద్దరూ ఇద్దరే: Hyper Aadi
హైపర్ ఆది, అభి ఇద్దరూ ఇద్దరే
ఈ మూడు రోజులు నిన్ను మేం వేసుకుంటున్నది చెబుతున్నావ్.. కానీ మిగిలిన నాలుగు రోజులు నువ్ ఎంత మందిని వేసుకుంటావ్ అని దారుణంగా మాట్లాడేశాడు. పైగా ఆది వేసిన పంచ్‌కు అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వడం మరో కొసమెరుపు. ఇలా ఆది హద్దులు దాటాడు అనుకుంటే.. అతని గురువు అభి మరింత రెచ్చిపోయాడు.
అభి ఎక్కువగా శ్రమ పడకుండా ఏదో అలా కామెడీ చేసేస్తుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో క్లిప్పులు తెచ్చాను చూస్తావారా? అని తన టీం మేట్‌ను అడుగుతుంటాడు. చీ మనో గారి ముందు క్లిప్పులు ఎలా చూస్తావ్ రా అని సదరు ఆర్టిస్ట్.. అంటే అభి తన జేబులోంచి బట్టలు ఆరేసే క్లిప్పులను తీసి చూపించాడు. క్లిప్పులు అంటే ఇవా? అని అవతలి వ్యక్తి ఆశ్చర్యపోతుంటే.. అభి, రోజా ఇలా అందరూ కూడా నువ్ ఏ క్లిప్పులు అనుకున్నావ్ అంటూ కౌంటర్ వేశారు. మొత్తానికి జబర్దస్త్‌లో ఇలాంటి దరిద్రాలు రోజురోజుకూ పెరిగిపోతోన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.