Hyper Aadhi: బీబీ5కు హైప‌ర్ ఆది.. ఇందులో నిజమెంత‌?

Hyper Aadhi: బుల్లితెర బిగ్ రియాలిటీ షో కార్య‌క్ర‌మం బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుంది. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ కార్యక్ర‌మంలో పాల్గొని దాద‌పు మూడున్న‌ర నెల‌ల పాటు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. విదేశాల‌లో మొదలైన ఈ షో మెల్ల‌గా బాలీవుడ్‌కి వ‌చ్చింది. అక్క‌డి నుండి అన్ని భాష‌ల‌కు పాకింది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో ఐదో సీజన్ జ‌రుపుకోనుంది.

Hyper Aadhi in Bigg Boss 5 Telugu
Hyper Aadhi in Bigg Boss 5 Telugu

ఈ షోకు సంబంధించి ప్ర‌తి రోజు పుంకాలుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న హైప‌ర్ ఆది బీబీ 5లో పాల్గొన‌బోతున్నాడ‌నే టాక్ జోరుగా న‌డుస్తుంది. మరి ఇందులో నిజ‌మెంత‌?

హైపర్ ఆది నిజంగానే బిగ్‌ బాస్‌ కు వెళ్లబోతున్నాడా అనే విషయమై జబర్దస్త్‌ టీమ్‌ స్పందించింది. హైప‌ర్ ఆది బిగ్ బాస్‌కు వెళ‌తాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు. జ‌బ‌ర్ధ‌స్త్‌తోనే అత‌ను ఉంటాడు అని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. ఒక‌వేళ బిగ్ బాస్‌కి వెళితే మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంలో పాల్గొనే ఛాన్సే ఉండ‌దు. గ‌త సీజ‌న్‌లో జ‌బ‌ర్ధ‌స్త్ నుండి వ‌చ్చిన అవినాష్ ప‌రిస్థితి ఏమైందో చూసాం. అత‌ను మాటీవీకి సంబంధించిన కార్యక్ర‌మాలో మాత్ర‌మే పాల్గొంటున్నాడు.

ఒక్క సారి జబర్దస్త్‌ ను వదిలేస్తే మళ్లీ అడుగు పెట్టడం సాధ్యం కాదు కాబ‌ట్టి హైప‌ర్ ఆది బిగ్ బాస్ షోలో అడుగుపెడ‌తాని వ‌స్తున్న వార్త‌ల‌లో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని అంటున్నారు.

ఎవ‌రైన మల్లె మాల వారితో తెగ తెంపులు చేసుకొని బిగ్ బాస్‌కి వెళ్లాలంటే అందుకుగాను వారు భారీ మొత్తంలో మల్లెమాల వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ఆ రిస్క్ అయితే ఎవ‌రు చేయరు. ఆ మ‌ధ్య సమంత హోస్ట్‌ గా వచ్చిన సమయంలో ఆది బిగ్‌ బాస్ స్క్రీన్‌ పై సందడి చేసిన విషయం తెల్సిందే. స్పెష‌ల్ గెస్ట్‌గా మాత్రం వ‌చ్చి కొద్ది సేపు సంద‌డి చేసి వెళ్లారు.

కాగా, ఈ సారి ఇంట్లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ 10 మందితో ఉన్న లిస్టు కూడా బాగానే హల్ చల్ చేస్తుంది. అందులో కంటెస్టెంట్స్ వివ‌రాలు చూస్తే ఇలా ఉన్నాయి.

1. హైపర్ ఆది
2. శేఖర్ మాస్టర్
3. షణ్ముఖ్ జస్వంత్
4. టిక్ టాక్ దుర్గా రావు
5. టిక్ టాక్ భాను
6. యాంకర్ శివ
7. సింగర్ మంగ్లీ
8. కమెడియన్ ప్రవీణ్
9. యాంకర్ వర్షిణి
10. న్యూస్ యాంకర్ ప్రత్యూష