139 మంది అత్యాచార కేసును విచారణ వేగవంతం

Advertisement

హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో 139 మంది అత్యాచారం చేసారని పెట్టిన కేసును పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఆ 139 మంది పాత్ర పై ఆరా తీస్తున్నారు. అయితే బాధితురాలు తెలిపిన ప్రముఖుల పాత్ర పై విచారణ జరుగుతోంది. ఇక పోలీసుల చేసిన దర్యాప్తులో డాలర్ బాయ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తెలిసింది. అయితే డాలర్ బాయ్ పలువురికి కాల్స్ చేసి బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. డాలర్‌ బాయ్‌, డిటెక్టివ్‌ పాత్ర పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో డాలర్‌ బాయ్‌ చేసిన అఘాయిత్యాలకు బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. డాలర్ బాయ్ వ్యవహరంపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే బాధితురాలి ఆడియోలను పోలీసులు రికార్డ్ చేశారు. ఇక కొంతమంది తమకు సంబంధం లేకపోయిన ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించిందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ కేసు విషయంలో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here