నిఘానేత్రంలో ప్రపంచంలోనే హైదరాబాద్ కు 15వ స్థానం

Advertisement

ప్రస్తుత రోజుల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తున్నాయి. అయితే సీసీ కెమెరాలతో దొంగతనాలు, ఇతర నేరాలను గుర్తించడానికి పోలీసులకు చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలు భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించి, భద్రత సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో లండన్ కి చెందిన కంపారిటెక్ అనే సంస్థ నిర్వహించిన సర్వే లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళు చేసిన సర్వే లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సీసీ కెమెరాలు వాడే 20 నగరాలను ప్రవేశపెట్టింది. దాంట్లో మన హైదరాబాద్ 15వ స్థానంలో ఉంది. అయితే మిగితా 19 నగరాల్లో ఒక లండన్ మినహా మిగితా 18 నగరాలు చైనాలో ఉన్నాయని వెల్లడించింది. అయితే 15వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రతి వెయ్యిమందికి 30 సీసీకెమెరాలు ఉండగా నగరం మొత్తంలో దాదాపు 3లక్షల సీసీకెమెరాలను ఏర్పాటుచేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here