హైదరాబాద్ లో ఈ నెల 7 నుండి మెట్రో పరుగులు

Advertisement

లాక్ డౌన్ కారణంగా మెట్రో రైల్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుండి హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రయల్ రన్‌ ని కూడా ప్రారంభించారు. మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మెట్రో టీమ్‌ అన్ని స్టేషన్ లను పరిశీలిస్తుంది. అలాగే కరోనా నియమ నిబంధనల విషయంలో ఏర్పాట్లను మెట్రో, ఎల్ ‌అండ్ ‌టీ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

అయితే ట్రయల్ రన్ లో భాగంగా ఈ రోజు అమీర్ పెట్ నుండి మియాపూర్ మార్గంలో మెట్రో నడిచింది. ముఖ్యంగా ఉదయం 7 గంటల సమయం నుంచి 12 గంటల సమయం వరకు తిరిగి 4 గంటల సమయం నుంచి 9 గంటల సమయం వరకు మాత్రమే మెట్రో నడవనుంది. ఇక కంటైన్మెంట్ జోన్లలో మెట్రో నడవదు అని తెలిపింది. ముఖ్యంగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here