GHMC మేయర్ కు కరోనా పాజిటివ్

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ రావు కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గతంలో రెండు సార్లు కరోనా అనుమానం తో టెస్టులు చేయించుకోగా ఆ రెండు సార్లు కూడా కరోనా నెగిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా మేయర్ పలు అభివృద్ధి పనులకు హాజరయ్యాడు. ఇక ఈ కార్యక్రమాలలో పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. ఇదే క్రమంలో కరోనా లక్షణాలు ఉన్న మేయర్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అలాగే మేయర్ కుటుంబసభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయించుకోనున్నారు. మేయర్ ను కలిసిన నాయకులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి కోలుకున్నా విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here