Hyderabad Kokapet Neopolis Land Priced At 100 Crores Value : రికార్డ్ : హైదరాబాద్ లో ఎకరం భూమి రూ.100 కోట్లు
NQ Staff - August 3, 2023 / 09:21 PM IST

Hyderabad Kokapet Neopolis Land Priced At 100 Crores Value :
హైదరాబాద్ లో భూముల ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి నిరూపితం అయ్యింది. రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా కోకాపేట నియో పొలిస్ భూముల్లో 10వ నెంబర్ ప్లాటు ఎకరం వంద కోట్లకు అమ్ముడు పోవడం చర్చనీయాంశంగా మారింది.
కోకాపేట నియో పొలిస్ భూముల్లోని 6,7,8,9,10,11,12,13,14 ప్లాట్లకు నేడు వేలం పాట నిర్వహించడం జరిగింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో దాదాపు అన్ని ప్లాట్ లు కూడా భారీ రేటు పలికాయి. 9 నెంబర్ ప్లాట్ లో ఎకరం భూమి 76.5 కోట్ల రూపాయల ధర పలికింది.
ప్రభుత్వ కనీస ధర రూ.35 కోట్లు…

Hyderabad Kokapet Neopolis Land Priced At 100 Crores Value
ప్రభుత్వం కనీస ధరగా ఎకరాకు రూ.35 కోట్లు నిర్ణయించింది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న భూమికి గాను 2,500 కోట్ల రూపాయలు సమీకరించాలని హెచ్ ఎండీఏ భావించింది. అయితే అంతకు మించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ అధికారులు పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో రేటు పకలడం తో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే ఐటీతో పాటు పలు రంగాల్లో హైదరాబాద్ నగరం దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో శివారు భూములకు ఈ స్థాయి రేటు పలుకుతోంది.