మీ ఇంటి వద్దే కరోనా పరీక్షలు

Advertisement

కరోనా తెలంగాణాలో రోజు రోజుకు దారుణంగా పెరుగుతుంది. అయితే పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని బస్తీవాసులకు, పేద ప్రజలకు ఆసుపత్రులు వెళ్లకుండా ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు గాను ప్రత్యేక మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసారు. అయితే ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారని జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెల్లడించారు.

అలాగే పెద్దలకు ముక్కులో, చిన్న పిల్లలకు గొంతులో పరీక్ష నమూనాలను తీసుకుంటారని తెలిపారు. ఇక ఈ విధానంతో టెస్టుల సంఖ్య కూడా పెరగనుంది. అలాగే ఆసుపత్రుల్లో గంటల తరబడి టెస్టుల కోసం వేచి ఉండే వారి సంఖ్యా కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here