హైదరాబాద్ లో హై రిస్క్ ప్లేస్ లు ఇవే.. పొరపాటున కూడా అటు సైడ్ వెళ్ళకండి

Advertisement

తెలంగాణ లో కరోనా విస్తృతి రోజు రోజు కి తార స్థాయికి చేరుకుంటుంది. ప్రతి రోజు ఇక్కడ 1000 కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని కొన్ని రోజుల్లో ఏకంగా 2000 లకు చేరువగా కూడా కేసులు చేరుతున్నాయి. అయితే తెలంగాణ లో నమోదు అయ్యే కేసుల్లో అత్యధిక శాతం అంటే దాదాపుగా 70 నుండి 80 శాతానికి పైగా కేవలం హైదరాబాద్ నుండే నమోదు కావడం జరుగుతుంది.

హైదరాబాద్ లో ఈ రేంజ్ లో కేసులు పెరుగుతుండడం తో ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఎక్కువ స్థాయిలో నమోదు అవుతున్న ప్రాంతాల వరకు హై రిస్క్ జోన్ లుగా ప్రకటించారు. 500 కంటే ఎక్కువ కేసులు ఉన్న వాటిని హై రిస్క్ జోన్ లుగా పరిగణించడం జరిగింది. ఆలా ఇప్పటికి హైదరాబాద్ లో 8 జోన్ లను గుర్తించారు మెహిదీపట్నం, యూసుఫ్ గూడ, అంబార్ పేట్, చంద్రయాన్ గుట్ట, చార్మినార్, ఖుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్ర నగర్ సర్కిల్ లను హై రిస్క్ జోన్ లు గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంచరించకూడదు. ఇక్కడ పరిస్థుతుల దృష్ట్యా ఈ జోన్ లలో ప్రయాణం అనేది కూడా శ్రేయష్కారం కాదు అంటూ వైద్యులు మరియు అధికారులు తెలపడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here