పట్టాలెక్కనున్న హైదరాబాద్ మెట్రో

Advertisement

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి ఐదు నెలలు దాటింది. అయితే ఇప్పటికే అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దాదాపు అన్ని తెరుచుకున్నాయి. కానీ సినిమా హాళ్లు, విద్యా సంస్థలు, మెట్రో సర్వీసులు అన్ని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే విద్యా సంస్థలు తెరవాలి అని ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సినిమా హాళ్లు కూడా తెరిచే ఆలోచనలో ఉన్నారు.

వీటితో పాటు హైదరాబాద్ లో ఉన్న మెట్రో రైలు కూడా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ మెట్రో ప్రారంభంతోనే అదరగొట్టింది. ట్రాఫిక్ కష్టాలు లేకుండా , తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో ప్రయాణికుల ఆదరణ కూడా ఎక్కువగా పొందింది. అయితే అన్ లాక్ 4 లో మళ్లీ ఇప్పుడు మెట్రో పరుగుకు ఛాన్స్‌ ఇస్తే మునుపటిలా దూసుకెళ్తుందా.. లేదా.. అన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here