హైదరాబాద్ లో 92 కంటైన్మెంట్ జోన్లు.. ఏ ఏరియా లో ఎక్కువగా ఉన్నాయో తెలుసా

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడికి హైదరాబాద్ నగరంలో కొత్తగా తొంబై రెండు కంటైన్మెంట్ జోన్ల వివరాలు వెల్లడించింది. అయితే దింట్లో చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకటల్ పల్లిలో 9 మరియు ఎల్బీ నగర్‌లో‌ ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇక చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో అత్యధికంగా 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.అలాగే నగరంలో ఉన్న అన్ని కంటైన్మెంట్ జోన్ల వివరాలు ఒకసారి చూద్దాం.

కూకట్‌పల్లి జోన్‌:
మూసాపేట సర్కిల్‌లోని జనతా నగర్, వడ్డెర బస్తీ. అలాగే కూకట్‌పల్లి సర్కిల్‌లోని దత్తాత్రేయ కాలనీ, పాపిరెడ్డి నగర్. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని వినాయక నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ. గాజులరామారం సర్కిల్‌లోని షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీ, భగత్ సింగ్ నగర్, అల్వాల్‌లోని అయ్యప్ప నగర్ ఇవన్నీ కూడా కూకట్ పల్లి జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

సికింద్రాబాద్ జోన్:
ముషీరాబాద్ సర్కిల్‌లోని భీమా మైదాన్, ఉందాబాగ్ , ముగ్గుల బస్తీ, తాల బస్తీ, కవాడిగూడ సాయిబాబా టెంపుల్, దయారా మార్కెట్, రాంనగర్ రామాలయం, హరినగర్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అంబర్‌పేట్ సర్కిల్‌లోని పటేల్ నగర్, షంషీర్ బాగ్, న్యూ పటేల్ నగర్, హైదర్‌గూడ, బర్కత్‌పురలోని సురభీ అపార్ట్‌మెంట్స్, విట్టల్‌వాడీ, ఇందిరా నగర్, తులసీ నగర్, సీఈ కాలనీ, కాచీగూడ జేపీ రెసిడెన్సీ, హైదర్‌గూడ, మోండా మార్కెట్లోని తక్కరా బస్తీ మరియు చిలకలగూడ ఈ ప్రాంతాలు అన్ని కూడా సికింద్రాబాద్ జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

ఖైరతాబాద్ జోన్:
మెహదీపట్నంలోని బజార్ ఘాట్, దోబీ ఘాట్, ఎంజీ నగర్, అసిఫ్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే జియాగూడ నవోదయ కాలనీ, కార్వాన్ రాంసింగ్‌పుర కంటైన్మెంటో జోన్లుగా ఉన్నాయి.అలాగే సనత్ నగర్ జెక్ కాలనీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, జూబ్లీహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్ ప్రాంతాలు అన్ని కూడా ఖైరతాబాద్ జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

ఎల్బీ నగర్ జోన్‌:
రామాంతపూర్‌లోని వెంకటరెడ్డి నగర్, పీఎస్ కాలనీ, బండ్లగూడలోని ఇంద్రప్రస్థ కాలనీ ప్రాంతాలు ఉన్నాయి.అలాగే సరూర్ నగర్ సర్కిల్‌లోని మైత్రి నగర్, సాహితి నగర్ ప్రాంతాలు అన్నీ కూడా ఎల్బీ నగర్ జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

శేరిలింగంపల్లి జోన్: యూసఫ్‌గూడ సర్కిల్‌లో న్యూ ప్రేమ్ నగర్, ఎర్రగడ్డ డివిజన్, వెంకటగిరి, వెంగళరావు నగర్ డివిజన్, క్రిష్ణా నగర్, యూసఫ్‌గూడ డివిజన్, ఓల్డ్ సుల్తాన్ నగర్, శ్రీ క్రిష్ణా నగర్, హబీబ్ ఫాతిమా నగర్ మరియు రహ్మత్ నగర్ ప్రాంతాలు అన్ని కూడా శేరిలింగంపల్లి జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

చార్మినార్ జోన్:
ఓల్డ్ మలక్‌పేట్‌లోని శంకర్ నగర్, చంచల్‌గూడ్ ఆజంపుర, మూసారాంబాగ్, బాఘ్ ఈ జహ్రా చవానీ, అక్బర్ బాగ్ లోని ప్రొఫెసర్ కాలనీ, సైదాబాద్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.ఈ ప్రాంతాలు అన్ని కూడా మలక్‌పేట్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి.అలాగే సంతోష్ నగర్ సర్కిల్ లో దానయ్య నగర్, ఎస్ఆర్టీ కాలనీ, పటేల్ నగర్, హనుమాన్ నగర్, కుర్మగూడ ప్రాంతాలు ఉన్నాయి. చాంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలోని శివాజీ నగర్, అరుంధతీ కాలనీ, లలితా బాఘ్, రక్షాపురం, రియాసత్ నగర్ రాజీవ్ గాంధీ నగర్, శివాజీ నగర్, బండ్లగూడ పటేల్ నగర్ మరియు చంద్రాయణగుట్ట కుమార్‌వాడీ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.అలాగే చార్మినార్ సర్కిల్‌లోని ఘన్సీ బజార్, మొఘల్‌పుర, మోచీ కాలనీ, అసద్ బాబా నగర్, దూద్ బౌలి, బీబీ కా చస్మా, కొండారెడ్డి గూడ, హైదర్‌గూడ ఆంబియెన్స్ ఫోర్ట్, ఉప్పలపల్లి ప్రాంతాలు అన్ని కూడా చార్మినార్ జోన్ లో కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here