Formula E Races : హైద్రాబాద్‌లో ఇండియా కార్ రేసింగ్ లీగ్ అట్టర్ ఫ్లాప్.?
NQ Staff - November 20, 2022 / 10:16 PM IST

Formula E Races : భాగ్యనగరం హైద్రాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ నిర్వహణ విషయమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రేసింగ్‌లను వీక్షించేందుకు సందర్శకులు ఉత్సాహం ప్రదర్శించినా, అందుకు తగ్గట్టు రేసింగులు జరగలేదు.
నిన్న పూర్ితగా టెస్ట రైడ్స్ జరగ్గా, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఫార్మ్ లా-4 రేస్ మాత్రమే జరిగింది. సాయంత్రం త్వరగానే చీకటి పడటంతో, రేసుల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ నిర్వహణకు కేవలం రెండ్రోజులు మాత్రమే అనుమతి వుంది.
నిలిచిన ప్రధాన రేసింగ్..
క్వాలిఫైయింగ్ రౌండ్ ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్ నిలిచిపోవడం పట్ల సందర్శకుల్లో ఒకింత అసహనం చోటు చేసుకుంది. కాగా, ఇండియా రేసింగ్ లీగ్ రద్దు చేసినట్లు సాయంత్రం నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా వుంటే, ఈ రోజు ఉదయం నుంచి రేసింగ్‌లో మొత్తం ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ మహిళా రేసర్‌ని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రమాదాల్లో రేసర్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి కూడా.
ఇదిలా వుంటే, వచ్చే ఏడాది ఫి్రబవరి 11న హైద్రాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే, తాజాగా తలపెట్టిన రేసింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న విమర్శలు, తొలి ప్రయత్నం ఓ మోస్తరు విజయవంతమైందనే అభిప్రాలూ.. వెరసి, మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.