హైదరాబాద్ లో 35 రోజుల్లో 6.6 లక్షల మందికి కరోనా

Advertisement

హైదరాబాద్: కేవలం 35 రోజుల్లోనే హైదరాబాద్ లో దాదాపు 6.6 లక్షల మంది కరోనా భారిన పడి సాధారణ స్థితికి వచ్చారని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ , సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థలు వెల్లడించాయి. సాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు అనుసరించే పద్ధతుల్లో మురుగునీటి నమూనాలను పరీక్షించడం కూడా ఒకటి. సాధారణంగా కరోనా సోకినవారి నాసికా స్రావాలు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్‌ బహిర్గతమవుతుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు మురుగునీటి పరీక్షల అంశంపై హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు పరిశోధన చేపట్టాయి.

కరోనా సోకి తగ్గినా సరే బాధితుల మలమూత్రాల్లో దాదాపు 35 రోజుల వరకు వైరస్‌ పదార్థాలు విడుదలవుతుంటాయి. లక్షణాలు ఉన్నవారితో పాటు లేనివారి విసర్జితాల్లోనూ వైరస్‌ ఉంటోంది. ప్రతి ఇంట్లోంచి ఎంత మురుగు వస్తోందనే గణాంకాల ఆధారంగా ఎంతమందికి కరోనా వచ్చి తగ్గి ఉంటుందనే అంచనాలు రూపొందించారు. నగరంలోని 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్‌ విడుదలైనట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. శుద్ధి చేయని మురుగు నీటి నమూనాలను ఫలితాలను కూడా కలిపి దాదాపు నగరంలో 6.6 లక్షల మంది కరోనా భారిన పడి ఉంటారని అంచనాలు వేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here