హైదరాబాద్ లో వాక్సిన్ వచ్చేస్తుంది : లాస్ట్ స్టేజి లో క్లినికల్ ట్రయల్స్

Admin - August 12, 2020 / 09:55 AM IST

హైదరాబాద్ లో వాక్సిన్ వచ్చేస్తుంది : లాస్ట్ స్టేజి లో క్లినికల్ ట్రయల్స్

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చేస్తున్న సమయంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. అలాగే మన దేశంలో కూడా చాలా వరకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయితే దాంట్లో భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ను జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తుంది.

భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వైద్య బృందం వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది. నిన్నఒక్క రోజే 11 మంది వాలంటీర్లకు నిమ్స్ వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. అలాగే ఈ రోజు మరో పది మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు నిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. అయితే దేశ వ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.ఇక ఈ ట్రయల్స్ అయిపోతే వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కి గొప్ప పేరు రానుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us