నన్ను 139 మంది రేప్ చేశారు.. 25 ఏళ్ల యువతి కంప్లైంట్.. 42 పేజీల FIR

హైదరాబాద్ లో సంచలనమైన కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని లెక్కపెట్టుకొని మరీ వారి పేర్లతో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె 42 పేజీల FIR ను పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తితో 2009లో వివాహం అయింది. ఇక వివాహం అయిన ఏడాదికే విడాకులతో ఆ బంధం ముగిసింది. ఆ తరువాత పుట్టింట్లో ఉండగా విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయలు ఏర్పడ్డాయి.

దీనితో ఆమె సోమాజిగూడ లోని రాజ్‌భవన్‌ దగ్గర ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఇక అక్కడ కొన్నేళ్లుగా తన పై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇక ఆ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగిన తరువాత చాలాసార్లు గ్యాంగ్ రేప్ చేశారనీ తెలిపింది. అలాగే గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని, తనను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసారని పేర్కొంది. సిగరెట్లతో కాలుస్తూ హింసించారని బాధితురాలు తెలిపింది. ఎవరికైనా ఈ విషయం తెలిపితే చంపేస్తామని గన్‌తో బెదిరించారని వివరించింది.

తన పై అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయ నాయకుల పీఏలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నారని బాధితురాలు వెల్లడించింది. వాళ్ళ నుండి తనకు ప్రాణహాని ఉందని పిర్యాదు చేసింది. గతంలో ఆ యువతికి పరిచయం ఉన్న అందరి పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ కేసులో సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడంతో సంచలనంగా మారింది. ఇక పోలీసులు ఈ కేసును సంబందించిన విషయాలను విచారణ జరుపుపుతున్నారు.