గవర్నర్ పై ట్వీట్ చేసిన తెరాస ఎమ్మెల్యే. తరువాత ఏమైందో తెలుసా..

Advertisement

తెరాస హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గవర్నర్ పై ఓ ట్వీట్ చేసాడు. ఇక తాను చేసిన ట్వీట్ లో.. బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించ వద్దని గవర్నర్ తమిళిసై ని ఉద్దేశించి ట్వీట్ చేసాడు. ఇక తాను చేసిన ట్వీట్ ను తెరాస పార్టీ ఆదేశాల మేరకు డిలీట్ చేసాడని వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు బీజేపీ విమర్శలకు స్పందించ వద్దని ఇప్పటికే పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అలాగే గవర్నర్ విషయంలోనూ అదే పద్దతిలో ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. అటు గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యలకు పార్టీలో అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here