భార్య‌ను ల‌క్ష‌కు అమ్మేసిన ప్ర‌భుద్దుడు.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

జ‌గ‌ప‌తిబాబు,ఆమ‌ని , రోజా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం శుభ‌ల‌గ్నం.ఈ సినిమాలో ఆమ‌ని డ‌బ్బుకి ఆశ ప‌డి త‌న భ‌ర్త‌ని రోజాకి అమ్ముతుంది. త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకొని ప‌శ్చాత‌పం చెందుతుంది. అయితే ఇప్పుడు ఓ ఘ‌నుడు త‌న భార్య‌ని ల‌క్ష‌కి అమ్మేశాడు.

ఒడిశా రాష్ట్రంలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు మూడు నెలల క్రితం సురేకెలకు చెందిన రేవతితో వివాహమైంది. ఆ తర్వాత ఉపాధి కోసం భార్యను తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు.

కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత సరోజ్‌రాణా తన భార్య రేవతిని ఓ కుటుంబానికి లక్షల రూపాయలకు అమ్మేసి ఎంచక్కా ఒడిశా తిరిగి వచ్చేశాడు. రేవతి గురించి ప్రశ్నించిన అత్తమామలకు.. ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు.

అల్లుడి తీరుపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ చేరుకుని రేవతిని రక్షించి తీసుకొచ్చారు.

సరోజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, భర్త తనను అమ్మేసిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని రేవతి చెప్పడం గమనార్హం.