T 20: రోహిత్, కోహ్లీ అర్ధ సెంచరీ.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
Priyanka - March 20, 2021 / 08:43 PM IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న డిసైడర్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి ఆడారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5సిక్స్‌లు) వరుస బౌండరీలు, సిక్సర్స్ కొడుతూ ఇంగ్లండ్ బౌలర్స్ గుండెల్లో రైళ్లు పరిగిత్తెంచాడు. ఉన్నంత సేపు స్కోరు బోర్డుని పరుగులెత్తించిన రోహిత్ లూజ్ బాల్‌కు ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రన్ రేట్ ఏ మాత్రం తగ్గకుండా ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.
రాహుల్ గైర్హాజరుతో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ( 52 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2సిక్స్‌లు) ఒకవైపు ఆచితూచి ఆడుతూనే మరో వైపు బౌండరీల వర్షం కురిపించాడు. రోహిత్‌తో 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్.. హార్ధిక్ పాండ్యాతోను భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. హార్ధిక్ పాండ్యా ( 17 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2సిక్స్‌లు) విలువైన రన్స్ భారత్ భారీ స్కోరు సాధించడంలో భాగమయ్యాయి. మొత్తానికి 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్స్‌లో రషీద్, బెన్ స్టోక్స్‌కు చెరో వికెట్ దక్కాయి.