Cricketers: క్రికెట్ చ‌రిత్ర‌లో భారీ సిక్స్.. క‌నుచూప మేర‌లో కూడా బాల్ క‌న‌ప‌డ‌లేదు

Cricketers: టీ 20ల‌కు బాగా అల‌వాటు ప‌డ్డ క్రికెట‌ర్స్ బంతిని బ‌లంగా బాద‌డంలో స్పెష‌లిస్ట్‌లుగా మారుతున్నారు. ఏ బంతి వేసినా బౌండరీకి త‌ర‌లించే ప‌ని పెట్టుకుంటున్న బ్యాట్స్‌మెన్స్ .. బౌల‌ర్స్‌కి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డ్స్ కూడా న‌మోదు చేస్తున్నారు.టీ 20 మ్యాచ్‌ల‌లో మ‌నం ఎన్నో సార్లు బంతి స్టేడియం దాటి బ‌య‌ట ప‌డ‌డం చూసి కాని ఇంగ్లండ్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20లో క్రికెట్ చరిత్రలో భారీ సిక్స‌ర్ బాదిన లియామ్ లివింగ్ స్టోన్ కొత్త చ‌రిత్ర సృష్టించాడు.

లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. ఈ సిక్స‌ర్ మైదానం దాటి ప‌క్క‌నే ఉన్న ర‌గ్బీపిచ్‌పై ప‌డింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 16 వ ఓవర్లో పాక్‌ బౌలర్‌ హరీస్‌ రవూఫ్‌ వేసిన బంతిని లాంగాన్‌ మీదుగా గట్టిగా బాదడంతో అది కనుచూపు మేరలో కనబడలేదు.
ప్ర‌పంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్‌ అని వ్యాఖ్యాతలతోపాటు నెటిజన్లు అంటున్నారు. సిక్స‌ర్ కొట్టిన‌ప్పుడు కామెంటేట‌ర్స్‌గా ఉన్న ఇయాన్‌ వార్డ్‌, కుమార సంగక్కర మ్యాచ్‌ అనంతరం ఇలాంటి సిక్స‌ర్‌ని ఎప్పుడు చూడ‌లేద‌ని వెల్లడించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ అధికారిక ట్విట్టర్‌లో ఈ సిక్సర్‌ వీడియోని షేర్ చేసి ‘ఇదేనా అతి భారీ సిక్స్?’ అంటూ ప్రశ్నించింది.

పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్‌స్టోన్ (38) చెలరేగడంతో భారీ స్కోరు న‌మోదు చేశారు. 201 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ బౌలింగ్‌తో పాకిస్తాన్ కట్టడి చేశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసుకుంది.